హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

పసి పల్లల చేత గొడ్డు చాకిరి చేయిస్తూ.. కెమెరాకు చిక్కిన హాస్టల్ వార్డెన్..

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వివేకానంద కాలనీలో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, వసతిగృహం వార్డెన్ విద్యార్థుల చేత గొడ్డు చాకిరీ చేయిస్తూ కెమెరాకు చిక్కాడు. ఇదేంటని ప్రశ్నించేందుకు ప్రయత్నం చేసినా మీడియాకు సరైన సమాధానం ఇవ్వలేదు. హాస్టల్ వార్డెన్ ఆంజనేయులు, ప్రిన్సిపాల్ గురుస్వామిరెడ్డి మీడియా అడిగిన ప్రశ్నల్నీ దాటవేస్తూ.. హాస్టల్ అద్దె భవనంలో ఉందని.. హాస్టల్ ఓనర్ కొత్తగా ఇల్లు నిర్మిస్తుంటే విద్యార్థులను గోడల క్యూరింగ్ కు నీళ్లు పోయడానికి పిల్లల్నీ పంపమంటే పంపినామని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. మరోవైపు.. ఈ పనిచేస్తున్న చిన్నారులు 10 ఏళ్ల లోపు ఆడపిల్లలు అయినా? కూడా హాస్టల్ వార్డెన్ వారిచేత పనిచేయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. దీనికి కారణమైన వ్యక్తులపై అధికారులు తగు చర్యలు తీసుకొవాలనీ డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18