విజయవాడలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం జరుగుతోంది. అంగరంగ వైభవంగా గణేష నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి స్వరూపాలు ఏర్పరిచి , మలయాళ సమ్మేళనం ,వివిధ రకాల కళాకారులతో అంగరంగ వైభవంగా నిమజ్జనానికి బయలుదేరాడు విఘ్నేశ్వరుడు. దీంతో ఈ వేడుకల్ని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.