ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎస్బీఐ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉలవపాడులోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో బ్యాంకులో ఉన్న కీలకమైన ఫైల్స్,కంప్యూటర్లు, ఫర్నిచర్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి.