అసెంబ్లీ ముట్టడికి రైతులు పెద్ద ఎత్తున కదిలారు. ఒక్కసారిగా వందలాదిమంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరుకున్నారు. ఏపీకి మూడు రాజధానులు ఉంటాయని తాజాగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు. దీంతో తమను సంప్రదించకుండా రాజధానిపై ప్రకటన చేస్తూ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించారంటూ రాజధాని రైతులు ఆందోళనకు దిగారు.