చిత్తూరు జిల్లా రామ కుప్పం తహసీల్దార్ ఆఫీసులో ఓ రైతు కుటుంబం కలకలం సృష్టించింది . తమ భూమి పట్టాను వేరొకరికి ఇచ్చినారని బాబు అనే రైతు ఆవేదన వ్యక్తం చేసాడు . 6నెలలుగా తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ , రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించినారు. తాళ్లతో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించినారు . దీంతో అక్కడ ఉన్నవారు వారిని అడ్డుకున్నారు.