వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కాన్వాయ్‌లోని ఓ వాహనం అమరావతిలో రైతును ఢీకొట్టింది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు ధర్నా చేస్తున్న సమయంలో ఓ వాహనం వేగంగా దూసుకొచ్చింది. కారు ముందు టైర్ రైతు కాలు మీదకు ఎక్కింది. దీంతో రైతు పడిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు.