గుంటూరు జిల్లా మంగళగిరి తహసీళ్దార్ కార్యాలయంలో ఒక రైతు తనతోపాటు పెట్రోల్ బాటిల్ తెచ్చుకొని తగల పెట్టుకుంటానని హల్ చల్ చేశాడు. మంగళగిరి మండలం చిన కాకానికి చెందిన శివ కోటేశ్వరావు అనే రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం, ఆడంగల్ కాపి కోసం తహసీల్దార్ కార్యానికి వచ్చాడు. గత కొన్ని నెలలుగా రెవెన్యూ అధికారులు ఆడంగల్ కాపీ ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నందునే తాను mro కార్యాలయంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డానని తెలిపాడు. అదే సర్వే నెంబర్ లో శంకర్రావు అనే రైతు వద్ద రూ.70 వేలు తీసుకొని ఆడంగల్ ఇచ్చారని, తనకి అడ్డురాని నిబంధనలు నాకెందుకు వస్తున్నాయని అధికారులును ప్రశ్నిస్తున్నాడు.