మడకశిర మండల పరిధిలోని కదిరేపల్లి పంచాయతీ గ్రామంలో వడ్డే రామాంజనేయులుకు 18 సెంట్లు భూమి ఉన్నది. పాస్ పుస్తకం కోసం చాలాసార్లు రెవిన్యూ అధికారుల చుట్టు తిరిగి అర్జీ పెట్టుకోగా ఇప్పటి వరకు స్పందించలేదు. మరో రైతుకు పాసుపుస్తకం అయినందుకు మనస్తాపం చెంది, మడకశిర ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.