హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఏరువాక పౌర్ణమిలో సందడి...ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆళ్ల, అంబటి రాంబాబు...

ఆంధ్రప్రదేశ్10:36 PM IST Jun 17, 2019

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో ఏరువాక పౌర్ణమిని రైతులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తో పాటు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, జంగా కృష్ణమూర్తి హాజరై ఏరువాక పౌర్ణమిలో భాగస్వాములయ్యారు. తొలకరి పులకరింపులతో దుక్కిదున్ని నాట్లు వేసే సమయం ఆసన్నమౌతుందని రైతన్నలు అరకలు కట్టి పూజలు చేసి భక్తితో ఏరువాక పౌర్ణమికి సోమవారం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలాన్ని దున్ని పలువురిని ఆకర్షించారు.

webtech_news18