హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : అమ్మో... భూకంపం దృశ్యాలు... సీసీటీవీ ఫుటేజ్‌లో...

ఆంధ్రప్రదేశ్10:35 AM January 26, 2020

ఏపీ, తెలంగాణలో అర్థరాత్రి 2.30 గంటలకు భూకంపం వచ్చింది. 8 సెకండ్లపాటూ భూమి కంపించింది. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ రిలీజైంది. అందులో భూమి కంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భూకంపం తర్వాత కాకులు కూడా అరిచినట్లు రికార్డైంది. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో... భూ ప్రకంపనలు వచ్చాయి. గుండ్రాయి, చిల్లకల్లు, జగ్గయ్య పేట బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.7గా నమోదైంది. ప్రజలు ఇళ్లలోంచీ బయటకు పరుగులు తీశారు. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. కొంత మంది తమ ఇళ్లలో వస్తువులు కూడా అటూ ఇటూ కదిలాయని అంటున్నారు. ఐతే... ఈ ప్రకంపనల వల్ల భయపడాల్సిన అవసరం లేదనీ, ఇవి చిన్న ప్రకంపనలేననీ అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా... ఇటీవల ఎప్పుడూ లేనిది ఇలా భూకంపం రావడంతో... ఆయా జిల్లాల్లో ప్రజల్లో అలజడి రేగింది.

webtech_news18