14 నెలలుగా పెండింగ్లో ఉన్న తమ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని మంత్రి అవంతి శ్రీనివాస్ నివాసాన్ని డ్వాక్రా సంఘాల మహిళలు ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఐదుగురు మహిళలను ఎంవీపీ పోలీస్ స్టేషన్కు తరలించగా, మిగిలిన ఆర్.పి.లు ఎంవీపీ స్టేషన్ ను ముట్టడించారు.