హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

వరుస సెలవులతో తిరుమలకు పెరుగుతున్న భక్తుల తాకిడి...

ఆంధ్రప్రదేశ్15:22 PM October 12, 2019

వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారికి ఇష్టమైన శనివారాలు (పెరటాసి నెల) ముగుస్తున్న సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఎటు చూసినా భక్తులతో కొండ కిటకిటలాడుతోంది. అద్దె గదులు,లకార్లు,తలనీలాలు కోసం భక్తులు బారులు తీరారు... ప్రస్తుతం వైకుంఠం ఒకటి రెండు లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి లేపాక్షి కూడలి వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో వీరికి సుమారు 24 నుండి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలియచేసింది.

webtech_news18