HOME » VIDEOS » Andhra-pradesh

Video : నలుగురి ప్రాణాలు కాపాడి... చనిపోయిన కుక్క...

Andhra Pradesh : మేకల మందను తీసుకొని కొండ ప్రాంతానికి వెళ్తున్న నలుగురు కాపర్ల ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం విడిచింది ఆ కుక్క. ప్రకాశం జిల్లా అర్థవీడు మండలంలోని అయ్యవారిపల్లి పంచాయతీ చిలకనగర్‌ కాలనీలో పది కుటుంబాలు నివసిస్తున్నాయి. వాళ్లందరూ మేకలు మేపుకొని జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నలుగురు కాపర్లు మేకల మందను భైరవుని కొండ ప్రాంతానికి తోలుకెళ్లారు. మార్గమధ్యలోని తిప్పల దగ్గరకు చేరుకోగానే మేకలన్నీ మేత కోసం పరుగులు తీశాయి. వాటి కాపర్లు మాటల్లోపడి నెమ్మదిగా నడుస్తున్నారు. ఐతే... ఇటీవల కురిసిన వర్షాలకు 11 కేవీ విద్యుత్తు స్తంభం నేలకూలిన విషయాన్ని వాళ్లు గుర్తించలేదు. ఇప్పటికీ విద్యుత్‌ ప్రసరణ జరుగుతుండటంతో మందలోని ఓ మేక కరెంటు తీగకు తగిలి చనిపోయింది. కరెంటు స్తంభం కూలిన వైపు నడవసాగారు కాపర్లు. మేక చనిపోవడాన్ని గమనించిన ఆ కుక్క... మిగిలిన మేకలు అటువైపు వెళ్లకుండా అడ్డుపడింది. ఆ తర్వాత పెద్దగా అరవసాగింది. ఏంటా కుక్క ఎందుకు అంతలా అరుస్తోంది అని కాపర్లు దగ్గరకు వెళ్లి చూశారు. చనిపోయిన మేక కనిపించింది. ఐతే... మిగిలిన మేకలు కరెంటు స్తంభం దగ్గరకు వెళ్తుంటే... వాటిని అడ్డుకునే క్రమంలో... కుక్కకు కరెంటు షాక్ తగిలింది. విలవిలలాడుతూ అది చనిపోయింది. ఆ కుక్కే లేకపోయి ఉంటే తాము కరెంటు తీగ తగిలి ప్రాణాలు విడిచే వాళ్లమని కాపర్లు ఆవేదన వ్యక్తం చేశారు. స్తంభం కూలి విద్యుత్తు ప్రసరణ కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

Krishna Kumar N

Top Stories