హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : రణరంగమైన దేవరగట్టు... 60 మందికి గాయాలు...

ఆంధ్రప్రదేశ్14:55 PM October 09, 2019

Kurnool Devaragattu : కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం ఈసారి కూడా రక్తపాతమైంది. మంగళవారం రాత్రి వేళ... కాగడాల కాంతిలో... ఉత్సవ విగ్రహాల్ని దక్కించుకోవడానికి 11 గ్రామాల ప్రజలు పోరాడారు. వేలాది కర్రలు పోటీ పడ్డాయి. కాగడాలు గాల్లో ఎగిరిపడ్డాయి. రక్తం చిందింది. ఈ పోరాటంలో 60 మందికి గాయాలయ్యాయి. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో... వాళ్లను ఆధోని ఆస్పత్రికి తరలించారు. వాస్తవానికి ఈసారి రక్తపాతం అన్నదే జరగకూడదని అధికారులు చాలా ప్రయత్నించారు. ఇలా చేయడం వల్ల అందరికీ నష్టమే అంటూ చైతన్య కార్యక్రమాలు జరిపారు. ఎంత చేసినా, ఎన్ని చెప్పినా, సంప్రదాయాన్ని కొనసాగించాల్సిందేనని ప్రజలు నిర్ణయించారు. ఫలితంగా రక్తపాతం ఆగలేదు గానీ... అధికారుల ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఆగినట్లైంది.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading