హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : ఉత్తరాంధ్ర, ఒడిశావైపు దూసుకొస్తున్న ఫణి తుఫాను

Cyclone Fani Live Updates : బంగాళాఖాతంలో ఏర్పడిన అతి తీవ్ర తుఫాను అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫానుగా మారింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఒడిశాలో పూరి దగ్గర మే 3న తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఫణి తుఫాను విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 500 కిలోమీటర్ల దూరంలో, పూరీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉంది. అత్యంత తీవ్రాతి తీవ్ర తుఫాను మరింత బలపడి... తీరానికి దగ్గరయ్యే కొద్దీ... భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 175 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. మే 2న ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఐదో నెంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

Krishna Kumar N