గుంటూరు జిల్లాలో 144 అమలులో ఉన్న మంగళగిరి, తాడేపల్లి ప్రాంతంలలో కర్ఫ్యూ అమలులో వున్న ప్రజలు మాత్రం రోడ్లపైకి వస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా ప్రజలు లెక్కచేయడంలేదు. యథావిధిగా తమకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు వాసూనేవున్నారు. కొరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు స్థానికులు మాత్రం పట్టించుకోవడం లేదు. బయటకు వచ్చిన వారిని పోలీసులు కట్టడి స్తున్నారు. పోలీస్ లు వాహానాలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నారు.