ఈ ఏడాది రాష్ట్రంలో క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని డీజీపీ సవాంగ్ తెలిపారు. అలాగే మాదకద్రవ్యాల విక్రయాలకు అడ్డుకట్ట వేశామన్నారు. మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ద పెట్టామని, దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. జీరో ఎఫ్ఐఆర్ను పటిష్టంగా అమలుచేస్తున్నామని చెప్పారు. అలాగే పోలీస్ సంక్షేమంలో భాగంగా వీక్లీ ఆఫ్ ప్రవేశపెట్టినట్టు వెల్లడించారు.