చిత్తూరు జిల్లా తిరుపతిలో నాటుబాంబుల కలకలం రేగింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ఆవరణలో నాటుబాంబులు పేలాయి. ఓ కుక్క నాటు బాంబులను నోట కరుచుకుని ఆస్పత్రి ఆవరణలోకి వెళ్లగా అక్కడ బాంబులు పేలాయి. ఈ పేలుడులో రెండు కుక్కలు చనిపోయాయి. పేలని మరో ఏడు బాంబులను స్థానికులు గుర్తించారు. ఆస్పత్రి ఆవరణలో పేలుడుతో ప్రజలు, రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది అక్కడకు చేరుకుని ఘటనస్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.