ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్నిర్వహించారు. కరోనా నివారణా చర్యలు, రైతుల సమస్యలు, రేషన్ పంపిణీ అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మే 15 కల్లా రైతు భరోసాకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. ఎవరైనా మిగిలిపోతే వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ప్రొసీజర్ తయారుచేసి గ్రామ సచివాలయాలకు పంపించాలని చెప్పారు. అర్హతలు, దరఖాస్తు విధాన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు.