ఏపీ అసెంబ్లీకి గడ్డిమోపులతో ర్యాలీగా వచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. రైతులు పండించిన పంటల్ని రోడ్లపై పెట్టుకొని పడిగాపులు కాస్తున్నారన్న ఆయన... వాటిని కొనే నాథుడు లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేరుసెనగ, శెనగలు, పామాయిల్, పసుపు, పత్తి ఇలా అన్ని పంటలూ దెబ్బతిన్నాయన్న చంద్రబాబు... రైతులకు గిట్టుబాటు ధరలు ఎందుకు ఇవ్వట్లేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.