గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో మార్కాపురం రోడ్ లో దొంగలు హల్ చల్ సృష్టించారు. ఒక అపార్ట్ మెంట్ వద్ద చేతుల్లో కత్తి, రాడ్లు, రాళ్లు పట్టుకొని తిరుగుతూ కనిపించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. వీరిని చెడ్డీ గ్యాంగ్ సభ్యులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎస్ పి. విజయారావు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్స్ కి హై ఎలర్ట్ మెసేజ్ పంపించారు.