ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష ప్రారంభించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మౌన దీక్షకు దిగారు. కొంతమంది బీజేపీ నేతలు కూడా ఆయనతోపాటూ దీక్షలో పాల్గొన్నారు. రాజధాని శంకుస్థాపన పవిత్ర మట్టికి పూజలు చేసి... కన్నా ఈ దీక్ష మొదలుపెట్టారు. గంట పాటు ఆయన దీక్ష చెయ్యనున్నారు. దీక్షా శిబిరం దగ్గరకు అమరావతి రైతులు పెద్ద ఎత్తున వచ్చారు.