విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దక్షిణ కొరియా దేశానికి చెందిన దాదాపు 40 మంది పైగా ప్రతినిధులు దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి.సురేష్ బాబు అమ్మవారి ప్రసాదములు, చిత్రపటమును అందజేశారు.