తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆర్టీసీ చార్జీలను పెంచింది. ఏపీలో ఆర్టీసీకి ఏటా రూ.1200 కోట్ల నష్టం వస్తుందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. పల్లెవెలుగు, సిటీ సర్వీస్‌పై కిలోమీటర్‌కు 10 పైసలు, మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్‌కు 20 పైసలు చొప్పున పెంచుతున్నట్టు మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పెరిగిన రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో త్వరలో చెబుతామని మంత్రి పేర్ని నాని చెప్పారు.