పెథాయ్ తుఫాన్‌తో ఏపీ అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు నీరో చక్రవర్తిలా రాజస్థాన్ లో ఫిడేల్ వాయించేందుకు వెళ్లారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య మండిపడ్డారు. రాష్ట్రంలో తుపాను కదలికలను ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా ఉండేందుకు సీఎం తీసుకున్న చర్యల వల్ల అపార ప్రాణనష్టం, ఆస్తినష్టం తప్పిందని తెలిపారు. జీవీఎల్ కు మతిస్థిమితం లేదని, ఆయన ఆరోపణలకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ధ్వజమెత్తారు.