ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాలు (AP Politics) మరోసారి సోషల్ మీడియా (Social Media) వేదికగా వేడెక్కాయి. రెండు రోజులుగా జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Minster Anil Kumar Yadav) పై ట్రోలింగ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) ను 2021 నాటికి పూర్తి చేస్తామని గతంలో మంత్రి అనిల్ చేసిన కామెంట్స్ పై టీడీపీ కార్యకర్తలు మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు.