అనంతపురం జిల్లా అమరాపురం మండలం తమ్మడపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించడం హేయమైన చర్య అని ప్రజలు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రంగు ఉన్న భవనంతో గ్రామసచివాలయ నిర్వహించలేరా అని పలువురు రాజకీయ నేతలతో సహా మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు.