గుంటూరు విజయవాడ మధ్య ఉన్న మంగళగిరి ప్రాంతం రాజధాని బిల్డింగుల నిర్మాణానికి ఎంతో అనువైన ప్రాంతమని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి అన్నారు. గతంలో కూడా అమరావతి నిర్మాణానికి తుల్లూరు తాడికొండ దిగువ ప్రాంతం గా ఉండటం వలన సరైంది కాదని శ్రీకృష్ణ కమిటీ చెప్పినప్పటికీ చంద్రబాబునాయుడు బలవంతంగా భూములను లాక్కొని నిర్మాణం చేపట్టారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆయన అన్నారు.