టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరికి ఎమ్మెల్యే వంశీకి మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ కారణంగానే ఆయన ఎంపీ సుజనాను కలిశారని పలువురు భావిస్తుంటే... పార్టీ మారతారన్న ప్రచారం సాగుతున్న సమయంలో ఎంపీ సుజనాను వంశీ కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. సుజనాను కలిసిన వంశీ... ఆయనతో కలిసి ఒకే కారులో ఒంగోలుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తానికి టీడీపీ అధినాయకత్వంలో అంటీముట్టనట్టుగా వ్యవహరించే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ... రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఆసక్తికరంగా మారింది.