ప్రజావేదికను కూల్చివేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాథ అన్నారు. ప్రజావేదికకు సంబంధించి అది అక్రమ కట్టడమా? కాదా? అనేదానిపై కోర్టులో వివాదం నడుస్తోందన్నారు. ప్రజావేదిక అక్రమకట్టడం అయితే ఈరోజు కలెక్టర్ల సమావేశాన్ని అక్కడ సీఎం ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు.