చంద్రబాబు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బాబు నివాసంపై డ్రోన్లు తిరుగుతున్నాయన్న అంశంపై అక్కడి వాతావరణం వేడిక్కింది. దీంతో చంద్రబాబు ఇంటివద్దకు చేరుకున్న టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వాహనాలను అడ్డుకోవడంతో వాగ్వాదం.. తోపులాట జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి తెలుగు తమ్ముళ్లను చెదరగొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.