కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ విమర్శలు చేశారు. ఏపీలో ఇసుక కొరత అనేది మొదటి సారి వింటున్నా అన్నారు. ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో ఎప్పుడూ లేదన్నారు. ప్రభుత్వం చేతకానితనం వల్లే వలన 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు నారా లోకేష్.