ఏపీకి మూడు రాజధానులు రావొచ్చని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందించారు. సీఎం చెప్పిందే ఫైనల్ అనుకుంటే ఎలా...? అని ప్రశ్నించారు. దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఆధారంగా జగన్ నిర్ణయం తీసుకుంటారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులుంటే బాగుంటుందని ముఖ్యమంత్రి చెప్పారని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కనీసం ఎవరితో చర్చించకుండా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. హైకోర్టు కోసం రాయలసీమలో ఆరు నెలలుగా ఆందోళన జరుగుతోందని... చంద్రబాబు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఏపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.