ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణితో కలిసి విజయవాడకు చేరుకున్నారు. మధ్యాహ్నం చిరంజీవి దంపతులు సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలవనున్నారు. కొన్నేళ్లుగా చిరంజీవి పూర్తిగా రాజకీయాలను పక్కనపెట్టి.. సినిమాలపైనే దృష్టి సారిస్తున్నాడు. తాజాగా చిరంజీవి.. ఉన్నట్టుండి ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డిని కలవనుండటం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.