ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థివదేహాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి గుంటూరుకు తరలించారు. కొద్దిసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు జిల్లాలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొచ్చారు. ఎన్టీఆర్ భవన్ నుంచి నకిరేకల్, చిట్యాల, కోదాడ, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ మీదుగా గుంటూరుకు తరలించారు.