దసరా పండగ రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నేతలు జూపూడి ప్రభాకర్, జనసేన నేత ఆకుల సత్యనారాయణ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వీరిద్దరికి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ.... సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీల అమలుకు కృషి చేస్తున్నారన్నారు. జగన్ ఆలోచన ప్రభుత్వ పనితీరు నచ్చి వైసీపీలో చేరానని తెలిపారు.