గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం లోని ఇసుక రీచ్ లు, డంపింగ్ సెంటర్ల వద్ద AITUC, CITU సంఘాలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న ఇసుక రీచ్ లను ఓపెన్ చేసి రెండు నెలల పాటు ఉచితంగా ఇసుకను ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు. సుమారు 30 మంది వామపక్ష నేతలు, కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరిని మంగళగిరి రూలర్ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.