మాజీ ఎంపీ , టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఇల్లు, ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ఢిల్లీలో రాయపాటికి సంబంధించిన ఇల్లు, కార్యాలయాల్లో దాడులు నిర్వహించారు. రాయపాటికి చెందిన ట్రాన్ ట్రాయ్ కంపెనీలో కూడా సోదాలు చేస్తున్నారు.