ఛలో ఆత్మకూరు పిలుపుతో చంద్రబాబు నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చంద్రబాబు ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ను సైతం నివాసం నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు.