ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరతపై స్పందించిన జగన్... త్వరలో ఇసుక సమస్య తీరుస్తుందన్నారు. ఇసుక కొరతపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ 90 రోజులుగా ఊహించని విధంగా వరద వస్తుందన్నారు. అన్ని నదులు వరద నీటితో పోటెత్తుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 265 రీచ్ లలో కేవలం 61 మాత్రమే పని చేస్తున్నాయని జగన్ అన్నారు. ఇసుక కోసం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు.