ఏపీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం అమలుపై ఏపీ బీజేపీ నేతలు స్పందించారు. ఏపీ బీజేపీ ఛీప్ కన్నా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ తాము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదన్నారు. అయితే భాషా... సంస్కృతిని కాపాడాలన్నారు. భాషను బలవంతంగా రుద్దద్దని కన్నా హితవులు పలికారు.అయితే అలాంటి సమయంలోనే ప్రభుత్వ పరంగా తెలుగుని విస్మరిస్తాం అంటే కుదరదన్నారు. భాషను ఎంచుకొనే ఆప్షన్ విధానం పెట్టాలన్నారు. ఏపీలో ఇంగ్లీషు బాషా అమలు వెనుక మతపరమైన కుట్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కన్నా.