హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

Video : జగన్ పట్టాభిషేకం చూసేందుకు తరలివస్తున్న జనం

నవ్యాంధ్ర రెండో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరి కాసేపట్లో పట్టాభిషేకం చేయనున్నారు. వేద పండితులు నిర్ణయించిన మధ్యాహ్నం 12.23గంటల సుముహూర్తంలో వైఎస్ జగన్ చేత ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు 14 ప్రదేశాల్లో ప్రత్యేకంగా LED స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని డ్రోన్ కెమెరాలతో షూట్ చేయబోతున్నారు. భద్రత కోసం 5వేల మంది పోలీసులతో పహారా కాయిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, DMK చీఫ్ స్టాలిన్ మరికొందరు ప్రముఖులు వస్తున్నారు. ఇప్పటికే ఇందిరా గాంధీ స్టేడియం వైసీపీ కార్యకర్తలు, అభిమానులతో సందడిగా మారింది. వీఐపీలు, ప్రజలు ఎవరికి కేటాయించిన గ్యాలరీల్లో వారు కూర్చునేలా అధికారులు, పోలీసులూ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు.

Krishna Kumar N