HOME » VIDEOS » Andhra-pradesh

Video : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్...

ఆంధ్రప్రదేశ్12:35 PM March 07, 2020

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ శనివారం ఉదయం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మూడు దఫాలుగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్ని ఒకే దశలో నిర్వహించాలనీ, సర్పంచ్ ఎన్నికల్ని రెండు దశల్లో నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ చెప్పారు. 660 ZPTC, 9639 MPTCలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ రిలీజ్ అవ్వడంతో... ఎన్నికల నియమావళి తక్షణం అమల్లోకి వచ్చింది. ఉద్యోగ బదిలీలపై నిషేధం అమల్లోకి వచ్చినట్లైంది. ఫిబ్రవరి 9 నుంచీ 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 17 నుంచీ 19 వరకు పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఫిబ్రవరి 21న ZPTC, MPTC (పరిషత్ ఎన్నికలు) ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 24న ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ఉంటుంది. ఫిబ్రవరి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 27న మొదటిదశ సర్పంచ్ (గ్రామ పంచాయతీ) ఎన్నికల నిర్వహణ, ఫిబ్రవరి 29న రెండో విడత సర్పంచ్ (గ్రామ పంచాయతీ) ఎన్నికల నిర్వహణ ఉంటుంది.

webtech_news18

Top Stories