శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలోని కిడ్నీ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఆళ్ల నాని ఉద్ధానంలో పర్యటించారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం, వైద్య సాయాన్ని వివరించారు.