'కువైట్‌లో నరకం చూస్తున్నాం. మా ఏజెంట్ తీసుకొచ్చి గల్ఫ్‌లో అమ్మేశాడు. మేం ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నాం. జగనన్నా మీరే కాపాడాలి' అంటూ సోషల్ మీడియాలో ఓ మహిళ వీడియో వైరల్‌గా మారింది. పశ్చిమ గోదావరికి చెందిన సుమారు 200 మంది మహిళలు అక్కడ ఉన్నారని.. ఎలాగైనా ఇండియాకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఆ మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ వీడియోపై రాష్ట్ర మంత్రి తానేటి వనిత స్పందించి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారందరినీ తిరిగి ఏపీకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు తెలిసింది.