ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఫిబ్రవరి 27న విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనికి సంబంధించి న్యాయవాది కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈనెల 12న డీజీపీ గౌతమ్ సవాంగ్ కోర్టుకు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు.