హోమ్ » వీడియోలు » ఆంధ్రప్రదేశ్

AP Election Updates: ఈవీఎంల మొరాయింపు...రంగంలోకి దిగిన ఎన్నికల సిబ్బంది

ఆంధ్రప్రదేశ్13:49 PM April 11, 2019

ఏపీలో అసెంబ్లీ-లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్న వేళా..కొన్ని చోట్లా ఈవీఎంలు మొరాయించాయి.. ఈ అంశంపై టీడీపీ, వైసీపీ, జనసేన భిన్నంగా స్పందించాయి. రాష్ట్రంలో 30శాతం ఈవీఎంలు పనిచేయడం లేదని, ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయగా.. వైసీపీ మాత్రం టీడీపీ ఉద్దేశపూర్వకంగానే ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించింది. అటు జనసేన మాత్రం ఈవీఎంల్లో లోపాలను సరిచేయాలని కోరింది.ఏపీలో జరుగుతున్నసార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మొరాయింపు అంశం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైన వెంటనే పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఏపీలో జరుగుతున్న ఎన్నికల అదనపు సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

webtech_news18