ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఢిల్లీ విమానాశ్రయంలో అధికారులు సాదరస్వాగతం పలికారు. మూడు రోజుల్లో రెండోసారి హస్తిన వెళ్లిన సీఎం జగన్.. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించనున్నారు. రాష్ట్ర పరిస్థితులతో పాటు రాజకీయ అంశాలపై కూడా వారిద్దరూ చర్చించనున్నారు.