కరోనా వ్యాప్తి, లాక్డౌన్ అమలుపై అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రదాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో జగన్ మాట్లాడారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్న తీరును వివరించారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం లేదని.. ఆర్థికంగా ఆదుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. వీడియో కాన్ఫరెన్స్లో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు.