ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో ప్రజావేదిక కూల్చివేత పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి ప్రకటించిన 24 గంటల్లోగానే అధికారులు ప్రజావేదిక భవనాన్ని కూల్చివేసేందుకు సిద్ధమైపోయారు. ఇప్పటికే జేసీబీలు, ప్రహారీ గోడ, షెడ్లను కూల్చివేశారు. రాత్రిలోగా ప్రజావేదికను పూర్తిగా నేలమట్టం చేయడమే లక్ష్యంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచే ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు చేరుకున్నారు. రాత్రికి ప్రజావేదికను కూల్చివేత పనిని పూర్తి చేయనున్నారు.